Jagan-case-clos-e-iamge-mastistreet

అధికార పార్టీ అధినేత 18 స్టేలు తెచ్చుకున్నా, ఇప్ప‌టికీ జ‌గ‌న్ ని ఆ కేసుల గురించే ప్ర‌స్తావిస్తారు అంటారు వైసీపీ నాయ‌కులు… జ‌గ‌న్ కేసులకు సంబంధించి ఒక్కో చార్జ్ షీటు పై విచార‌ణ జ‌రిగి లోపాలు లేవు అని కొట్టివేస్తుండ‌టంతో టీడీపీ నాయ‌కులు గుండెల్లో రైల్లు ప‌రిగెడుతున్నాయి.. ఇదే జ‌గ‌న్ కు ఈడీ స‌మ‌న్లు ఇస్తే ఆస్ధాన మీడియాలు రోజూ బాబుగారి లెక్క‌ల్లో 27 గంట‌లు బ్రేకింగ్స్ వేసి జ‌గ‌న్ జైలుకే అంటూ విష‌ప్ర‌చారం చేస్తాయి.. తాజాగా జ‌గ‌న్ కేసులో మ‌రో కీల‌క అంశం జ‌రిగింది..

నాలెడ్జ్ హబ్ భూకేటాయింపుల విష‌యంలో న‌మోదైన చార్జ్ షీట్ 9 ను హైకోర్టు కొట్టేసింది.. ఇందులో ఎటువంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేద‌ని… అన్నిప‌ద్ద‌తి ప్ర‌కారం జ‌రిగాయని విచార‌ణ త‌ర్వాత వెల్ల‌డించింది.. దీనిలో అప్పటి ఐ.ఏ.యస్ అధికారి శాంబాబ్‌ పాత్ర ఉంద‌ని అభియోగం మోపారు… దీంతో ఆయ‌న‌కు ఇందులో ఎటువంటి సంబంధం లేద‌ని కోర్టు తేల్చిచెప్పింది.. అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేద‌ని తీర్పు ఇచ్చింది.. ఆయ‌న పై మోప‌బ‌డిన చార్జ్ షీట్ ను కొట్టేసింది హైకోర్టు..

అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు చేసిన 8841 ఎకరాల భూమి కేటాయింపులన్నీ కూడా బిజినెస్‌ రూల్స్ ప్ర‌కారం, ఇతర నిబంధనల మేరకే జరిగాయని. ఈ కేటాయింపులన్నీ శాఖల ను సంప్రదించిన తరువాతనే జరిగాయని వెల్ల‌డించారు. అంతే కాకుండా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, సీఎం ఆమోదం తరువాతనే లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌తో ఒప్పందం జరిగిందని.. అప్పటి కేబినెట్‌ కూడా దీనికి ఆమోదం తెలిపిందని పేర్కొంది. ఈ వ్యవహారంలో అప్పటి పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి శాంబాబ్‌ ఎక్కడా కూడా వ్యక్తిగత ప్రయోజనాలు పొందలేదని తేలింది..

ఇలాగే జ‌గ‌న్ పై మోపిన కేసులు చార్జ్ షీట్లు తొంద‌ర‌లోనే కొట్టేస్తార‌ని, నిజం నిప్పులాంటిది అని వైసీపీ నాయ‌కులు తెలుగు త‌మ్ముళ్ల‌కు కౌంట‌ర్ ఇస్తున్నారు.