ntr

తెలుగు బుల్లితెర రంగంలో టీఆర్పీ లలో కనీవిని ఎరుగని రికార్డులను సొంతం చేసుకున్న ‘బిగ్ బాస్’ షో ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కుంటూ క్రమంగా ప్రేక్షకుల ఆదరణను కోల్పోయే ప్రమాదం ఉంది అని కొందరు ఈ షో నిర్వాహకులకు హెచ్చరికలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీకెండ్ లో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డంతో ఈ షోకి ఊపు కేవలం రెండు రోజులు మాతమే ఉంటూ మళ్ళీ వర్కింగ్ డేస్ మొదలు అవ్వగానే ఈ షోకు రేటింగ్స్ పడిపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

నిజానికి ఈ షో ప్రారంభం ముందు వరకు ‘బిగ్ బాస్’ అనేది జూనియర్ ఎన్టీఆర్ ను ఫ్యామిలీ ప్రేక్షకులను దగ్గర చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ షోకు తారక్ ఎంతమేరకు ఉపయోగపడుతున్నాడు అన్న విషయమై కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

అయితే ఈషో రేటింగ్స్ ఇంతలా మార్పులు చోటు చేసుకోవడానికి ‘బిగ్ బాస్’ హౌస్ లో ఉన్న పార్టిసిపెంట్స్ ఎంపికే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ‘బిగ్ బాస్’ పాపులర్ కావడానికి ఆయా షోలలో పాల్గొంటున్న మహిళా సెలబ్రిటీలు ప్రదర్శించిన గ్లామర్ ప్రధాన కారణం.

అయితే తెలుగు ‘బిగ్ బాస్’ షోలో అందుకు అందుకు విరుద్ధంగా ఫ్యామిలీ డ్రామాలతో కొనసాగుతుండడం ఈ షోకు ఇలా నెగిటివ్ రేటింగ్స్ రావడానికి కారణం అని అంటున్నారు. తెలుగు నేటివిటికి సహజంగా ఈ షోలో ఉన్న సీన్స్ కనిపిస్తూ ఉన్నా అదే సీన్లు నిత్యం ఇళ్ళల్లో చూస్తున్న వారికి ఇలాంటి సీన్లు ఒక రకంగా విసుగు తెప్పిస్తున్నాయి అన్న విమర్శలు కూడ ఉన్నాయి.

దీనితో ఈ షో రేటింగ్స్ పెంచుదామని వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన దీక్షా పంత్ ద్వారా చేసిన ప్రయత్నాలు కూడ పరాజయం చెందడంతో ఈ షో రేటింగ్స్ పెంచడానికి ఈ వీకెండ్ లో మరో హాట్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నట్లు టాక్. నిన్న జరిగిన టాస్క్ లో విజేతగా శివ బాలాజీ వచ్చిన నేపధ్యంలో అతడిని బిగ్ బాస్ కెప్టెన్ గా ఎంపిక చేసాడు. మరి ఈరోజు నుంచి మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్న జూనియర్ ఎంట్రీతో ఈ షో రేటింగ్స్ ఏ స్థాయికి పెరిగి ఎంత వరకు ఈ షోను రక్షిస్తుందో చూడాలి..