Ramcharan-sriya

చిరంజీవి త‌న‌యుడిగా కాకుండా త‌న‌కంటూ స‌ప‌రేట్ ఇమేజ్ ఏర్ప‌ర‌చుకున్న న‌టుడు రామ్ చ‌ర‌ణ్‌. ఇక దాదాపు అంద‌రు సీనియ‌ర్ హీరోల స‌ర‌స‌న జ‌త‌క‌ట్టి మెప్పించిన గ్లామ‌ర్ డాల్ శ్రేయ‌. వీరిద్ద‌రు సినిమాలోకి రాక‌ముందు ఓ యాక్టింగ్ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఓ ఎమోష‌నల్ సీన్ ని పండించేందుకు ట్రై చేశారు.

ఇందులో రామ్ చ‌రణ్ కాస్త బిడియంతో పొడిపొడిగా మాట్లాడుతున్న‌ట్టు క‌నిపిస్తుండ‌గా, శ్రేయ త‌న‌దైన ఎక్స్ ప్రెష‌న్స్ తో అద‌ర‌గొట్టేసింది. వారు శిక్ష‌ణ తీసుకుంటున్న స‌మయంలో తీసిన‌ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ గా మారింది. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో రంగ‌స్థ‌లం 1985 అనే చిత్రాన్ని చేస్తుండ‌గా, శ్రేయ పైసా వ‌సూల్ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది.