Jai-lavakusa-image

ప్రస్తుతం ఎక్కడ చూసినా రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్తల హడావిడి కనిపిస్తోంది. మరో రెండు వారాలలో రజినీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటన ఇవ్వడం ఖాయం అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రజినీకాంత్ అభిమానులు రజినీ కీలక ప్రకటన గురించి అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ వార్తలు ఇలా హడావిడి చేస్తుంటే రజినీకాంత్ శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘రోబో 2.0’ మూవీ డబ్బింగ్ రైట్స్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 75 కోట్లకు అమ్మకం జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్తలు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి.

తెలుగు ప్రేక్షకులలో రజినీకాంత్ మ్యానియా బాగా ఉంది అన్న విషయం వాస్తవమే అయినా ఒక డబ్బింగ్ సినిమాకు 75 కోట్ల రేటు పలకడం ఎవరికీ అంతుచిక్కని విషయంగా మారింది. దీనితో ఈమూవీ రైట్స్ ను కొనుక్కున్న బయ్యర్ కనీస లాభాలతో బయటకు రావాలి అంటే ఈసినిమా ఖచ్చితంగా 100 కలక్షన్స్ ను రాబట్టాలి అని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు.

భారీ అంచనాలు ఉన్న ‘స్పైడర్’ ‘జై లవ కుశ’ స్థాయికి మించి ఈసినిమాకు జరిగిన బిజినెస్ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ సమాధానంలేని ప్ర1శ్నగా మారింది. అయితే ఈమూవీ వచ్చే సంవత్సరం జనవరి 12న విడుదల అవుతుంది అని లీకులు వస్తున్న సందర్భంలో అదే సమయంలో సంక్రాంతిని టార్గెట్ చేస్తూ రాబోతున్న పవన్ త్రివిక్రమ్ లమూవీతో రజినీ 2.0 వార్ చేయబోతున్న నేపధ్యంలో వచ్చే సంక్రాంతి వార్ కూడ ఆశ్చర్యకరంగా మారబోతోంది అని అంటున్నారు..