కథానాయకుడు రవితేజ నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. మెహరీన్‌ కథానాయిక. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు దిల్‌రాజు శనివారం ప్రకటించారు. మాస్‌ మహారాజా రవితేజను మునుపెన్నడూ లేనివిధంగా చూపించబోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కొత్త ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. రాజా కొత్త అవతారంలో వస్తున్నాడని అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు.

12brkraja1ఇందులో రవితేజ అంధుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఎస్‌. థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మరోపక్క రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ చిత్రంలో నటిస్తున్నారు. రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలు. విక్రమ్‌ సిరికొండ దర్శకుడు.