Ntr

`తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. అచ్చం తాత పోలికలతో ఉండటంతో మనోడికి మంచి ప్లస్ పాయింట్ కావడమే కాకుండా నటన, డ్యాన్స్ లో తనకంటూ ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన సినిమాలు దాదాపు బ్లాక్ బస్టర్ అయినవే..గత మూడు సంవత్సరాల నుంచి టెంపర్, న్నానకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హ్యాట్రిక్ విజయం సాధించాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ మద్య స్టార్ హీరోలు బుల్లితెరపై మురిపిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, కోలీవుడ్ లో కమల్ హాసన్, శాండిల్ వుడ్ లో ఈగ ఫేమ్ సుదీప్ లు అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ప్రోగ్రామ్ ‘బిగ్ బాస్’ తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలుగు లో ఈ ప్రోగ్రామ్ కోసం జూ.ఎన్టీఆర్ ని తీసుకోవడం టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. తెలుగు బుల్లితెరపై ఇప్పటికే నాగార్జున, చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ లో కనిపించారు.

ఇక అడపా దడపా స్టార్ కొన్ని కార్యక్రమాల్లో వస్తూనే ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. తాజాగా మరో ప్రోమో లో ఎన్టీఆర్ చుట్టూ కెమెరాలు ఉండటంతో ‘ఓరి నాయనో కెమెరాలు ఎవడ్రా ఇక్కడ పెట్టింది..నేను పెట్టమంది బిగ్ బాస్ హౌజ్ లో నా హౌజ్ లో కాదు…మార్చండి త్వరగా’ అంటూ ఎన్టీఆర్ చాలా ఫన్నీగా చెప్పడం అందరినీ నవ్వించింది.